Monday, December 23, 2024

కెటిఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని భోల‌క్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మ‌హ్మ‌ద్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను దుర్భాషలాడిన కేసులో గౌస్ ను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్లితే.. భోల‌క్‌పూర్ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు తెరిచి ఉన్న హోట‌ళ్లు, షాపులను మూయించేందుకు అక్క‌డికి వెళ్లిన పోలీసులపై గౌస్ నోరు పారేసుకున్నాడు. పోలీసులపై ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను నెటిజన్లు మంత్రి కెటిఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం క‌లిగించిన వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని, ఏ పార్టీకి సంబంధించిన వారైనా వదలొద్దని ట్విట్ట‌ర్ వేదిక‌గా డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో పోలీసులు గౌస్ అరెస్టు చేశారు. మరికాసేపట్లో గౌస్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.

Musheerabad Police arrest Bholakpur Corporator

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News