Wednesday, January 22, 2025

ముషీర్ ఖాన్ అజేయ శతకం

- Advertisement -
- Advertisement -

ఇండియా-బి 202/7
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్

బెంగళూరు: ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇండియాబి టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. బెంగళూరు వేదికగా ఇండియాఎతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఇండియా బి టీమ్ తడబడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30) పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (13) పరుగులు చేశాడు. ఇక ఒంటరి పోరాటం చేసిన ముషీర్ ఖాన్ 227 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 105 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), నితీష్ రెడ్డి (0), వాషింగ్టన్ సుందర్ (0), సాయి కిశోర్ (1) విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ముషీర్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి నవ్‌దీప్ సైని అండగా నిలిచాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సైని 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ముషీర్ ఖాన్ అజేయ శతకం సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఖలీల్, ఆకాశ్‌దీప్, అవేశ్ ఖాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News