Thursday, January 23, 2025

మొక్కలు నాటిన ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి సిబ్బంది

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో ముషీరాబాద్ కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా సూర్యప్రకాష్ మాట్లాడారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని చెప్పారు. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటుతూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News