Monday, January 20, 2025

పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: అనుమతులు ఇంటి నిర్మాణం కోసం తీసుకుని వాణిజ్య పరమైన భవన నిర్మాణాలు చేపట్టాలంటే అది మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో మాత్రమే సాధ్యం. ఇదే విధంగా అదనపు అంతస్తులు, పెంట్ హౌస్‌లు, పాత భవనాలపై నిర్మాణాలను యధేచ్ఛగా నిర్మించుకోవచ్చు. కాకపోతే నిర్మాణ దారులు చేయాల్సిందల్లా ఒక్కటే టౌన్ ప్లానింగ్ అధికారులకు అడిగినంత డబ్బులను ముట్టజెప్పి వారిని ప్రసన్నం చేసుకోవడమే.

అలా చేసినట్లయితే ఆ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు కాదు కదా అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఉన్నతాధికారులైనటువంటి జోనల్ కమీషనర్, సిపి, సిసిపి, విజిలెన్స్, ఎన్ఫ్‌ర్స్‌మెంట్ అధికారులతో పాటు జిహెచ్‌ఎంసి కమీషనర్‌కు ఫిర్యాదు చేసినా ఇటువంటి అక్రమ నిర్మాణాలపై వారు చర్యలు తీసుకోకుండా చూసుకోగలరు స్థానిక పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు. ఇందుకు మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ప్రధాన రహదారులను ఆనుకుని జరుగుతున్న సెల్లార్‌లు, వాణిజ్య పరమైన భవన నిర్మాణాలు, పాత భవనాలపై అదనపు అంతస్తుల నిర్మాణాలే ఇందుకు చక్కని నిదర్శనం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మల్కాజిగిరి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో.

వారికి ఉన్నత స్థాయి అధికారులు అండదండలు, సంపూర్ణ సహకారం ఎంత మేరకు ఉందో. అక్రమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా టిపిఎస్ తుల్జా సింగ్, డిప్యూటీ సిటీ ప్లానర్ గజానంద్‌లతో పాటు కింది స్థాయి సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఇంటి నిర్మాణ అనుమతులను మంజూరు చేయడంలో కూడా యజమానులను సంబంధిత అధికారులు వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్‌మెట్, గౌతం నగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజిగిరి డివిజన్లలో పుట్టగొడుగుల్లా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పడో ఒకసారి ఎవరికో ఒకరికి నామ మాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుకోవడం సంబంధిత అధికారులకు పరిపాటిగా మారింది.
ఉన్నతాధికారులతో లోపాయకారి ఒప్పందం…
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్‌లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులైనటువంటి జోనల్ కమిషనర్, సిపి, సిసిపి, ఎన్‌ఫోర్స్ మెంట్, విజిలెన్స్, జిహెచ్‌ఎమ్‌సి కమిషనర్ వంటి ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదులు వె ళ్ళినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్త్తుతున్నా యి.

మల్కాజిగిరి సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల నుండి ఉన్నతాధికారులకు ప్రతీ నెలా మామూళ్ళు వెళ్తాయనేది బహిరంగ రహస్యం. అం దుకే అక్రమ నిర్మాణాలపై చర్యలకు వీరు దూరంగా ఉంటారు. నిబంధనలకు విరుద్దంగా వెలుస్తున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన విజిలెన్స్ విభాగం కూడా పట్టించుకోకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్న.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News