Wednesday, January 22, 2025

మూసీ ప్రక్షాళన ఆగదు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో మూసీ నది పరీవాహక ప్రాంతం బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో, సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ మురికిని వదిలిస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

‘‘కెసిఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోంది,  కెసిఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల కోసం ఏమైనా చేశారా?” అని రేవంత్ రెడ్డి నిలదీశారు. అనవసర విమర్శలు పక్కనబెట్టి, మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలు ఇవ్వండి’’ అని విపక్షాలకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News