మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులను నవంబర్ 01వ తేదీ నుంచి ప్రా రంభిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బా పూఘాట్ నుంచి ఈ పనులు ప్రారంభం అవుతాయ ని ఆయన పేర్కొన్నారు. నవంబర్‌లోపే మూసీ ప్రా జెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. నెల రోజుల్లో మూసీ ప్రాజెక్టు డిజైన్లు సిద్ధమవుతాయని ఆయన చెప్పారు. గండిపేట, హియాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. మొదటగా 21 కి లోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభిస్తున్నట్లు సిఎం చెప్పారు.
మంగళవారం సిఎం రేవంత్‌రెడ్డి విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తామన్నారు. బాపూఘాట్ దగ్గర అభివృద్ధి కోసం ఆర్మీ స్థలం అడిగామన్నారు. 15 రోజుల్లో ఎస్టీపిలకు టెండర్లు వేస్తామని ఆయన తెలిపారు. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్ రీక్రియేషన్ సెం టర్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదు
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులపై విపక్షాలతో చర్చలకు తాము సిద్ధమని ఆయన కీలక ప్రకటన చేశారు. మూసీ పునరుజ్జీవంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ వాళ్లు తమ అభ్యంతరాల ను తెలియజేయాలన్నారు. తనను కలవటం అ భ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చని, విపక్షాలు ప్రతిపాదనలు సూచించవచ్చని సిఎం తెలిపారు. మూసీ పై ముందడుగేనని వెనకడుగు వేసేది లేదని, నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదని సిఎం తేల్చిచెప్పారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు చేయాలనుకున్నా మేలు చేసి తీరుతామని సిఎం ఉద్ఘాటించారు.
వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా
వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని కెటిఆర్, హరీష్ రావు కూడా తనతో కలిసి రావాలని సిఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదామని సిఎం రేవంత్‌రెడ్డి డిమాం డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విచారణ విషయం లో కక్షసాధింపు ఉండదని సిఎం తేల్చిచెప్పారు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక ముందడుగు పడిందని ప్రభాకర్ రావు, శ్రవణ్ పాస్‌పోర్టులు రద్దు చేశామని, త్వరలోనే వాళ్లు అరెస్టు అవుతారని సిఎం రేవంత్ తెలిపారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. మూసీ కోసం భూములిచ్చే వారికి 100 శాతం సంతృప్తి చెం దేలా ప్యాకేజీ ఇస్తామని సిఎం రేవంత్ తెలిపా రు. మూసీ కోసం ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమన్నా రు. మూసీ ప్రాజెక్టును ఎన్జీఓలు వ్యతిరేకిస్తే అ ర్థం ఉందని, పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్ధం కావడం లేదన్నాదు. కెటిఆర్ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటారని, మూసీని బాగు చేసే అంశంలో కెటిఆర్ తన ఆలోచనలు చెప్పొచ్చని ఆయన తెలిపారు. అంతర్జాతీయ అవగాహన ఉన్న కెటిఆర్‌కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియ దా? మూసీ పునరుజ్జీవంపై కెటిఆర్ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నానని, మూసీపై కెటిఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లు తమ ప్రతిపాదనలు తెలపాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అవసరం వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాం తంలో పాదయాత్ర చేస్తానని సిఎం రేవంత్ ప్రకటించారు. అక్రమ సొమ్ముతో బిఆర్‌ఎస్ సోషల్ మీడియాను కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాతో ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. ఎంతో ఆలోచించి హైడ్రాను రంగంలో కి దింపానని, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని మాట్లాడటం కరెక్ట్ కాదని, దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత వచ్చిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు.