Sunday, November 17, 2024

మూసీ అభివృద్ధికి మోక్షం లభించేనా..!

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వంలో మొదలైన మూసీ అభివృద్ధి పనులు ముందుకు పడని వైనం
కొన్ని చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత.. భూసేకరణకు ఇబ్బందులు
నూతన ప్రభుత్వంలో మూసీపై అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశం

మన తెలంగాణ / సిటీబ్యూరో: గత ప్రభుత్వ హయాం లో మొదలైన మూసీ అభివృద్ధి జపం ఇప్పటీ వరకు అలాగే మిగిలిపోయింది. గడిచిన 10ఏళ్ల కాలంలో మూ సీని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చడంతో పాటు సుందరీకరణ ద్వారా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రస్తుతం మురికి కూపంగా మారిన మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేయడం ద్వారా నాటి వైభవాన్ని తీసుకు వచ్చేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధ్దం చేసింది. అంతేకాకుండా గత ప్రభుత్వం ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు’ను చేసి ఛైర్మన్లను సైతం నియమించింది. బోర్డు పర్యవేక్షణలో గుజరాత్ లోని సబర్మతి నది తరహాలో మూసీని అభివృద్ధి చేయనున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది.

అంతేకాకుండా 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో మూసీ అభివృద్ధి హామీ ఇవ్వడమే కాకుండా గెలిచిన తర్వాత 2 017 జులైలో అప్పటి మేయర్, అధికార గణంతో కలిసి సబర్మతి ప్రాంతంలో సైతం పర్యటించారు. ఇందులో భాగంగా మూసీ ప్రక్షాళనకు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఆగస్టులోనే మూసీ ప్రా జెక్టు పనులు ప్రారంభించనట్లు సైతం ప్రకటించారు. మూసీనది సుందరీకణ పనులతో పాటు మూసీపై వంతెనల నిర్మాణంతోపాటు బోటింగ్ సదుపాయం, మూసీపై స్వై వేలు, రెండు వైపులా ఎక్స్‌ప్రెస్‌వేలు రాబోతున్నట్లు చెప్పారు.

ఇందుకు సంబంధించి ప్రణాళికలు సైతం సిద్ధం అయినప్పటికీ నిధులు లేక ముందుకు సాగలేదు. ఇదే క్రమంలో నదుల పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్ర భుత్వం నేషనల్ రివర్వాటర్ కన్జర్వేషన్ స్కీం కింద మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో పరివాహక ప్రాంతాల అభివృద్ధి, కాలుష్య కారకాల నియంత్రణ, మురుగు నీరు కలవకుండా ఇంటర్వేషన్ అండ్ డైవర్షన్ నిర్మాణాలు, ల్యాండ్ స్కేప్, పార్కులను అభివృద్ధి చేసేలా నిధులు కేటాయించింది. అప్పటి ప్రతిపాదనలకు అనుగుణంగా రూ.400 కోట్లను విడుదల చేసింది. దీంతో అక్కడక్కడ మూసీ నది అభివృద్ధ్ది పనులకు చేపట్టారు.

15 బ్రిడ్జిలకు అనుమతులు జారీ
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్ర భుత్వం మూసీ, ఈసీ నదులపై ప్రజలకు ఇబ్బందులు అయ్యే చోట రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలను వెంటనే నిర్మించేందుకు అనుమతులు జారీ చేసింది. ఇందులో మూసారంబాగ్ సహా మరో ఆరు చోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు సైతం చేశారు తప్పితే పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇందుకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయకుండానే రెవెన్యూ అధికారులు హడావుడి చేయడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడం తో అంతటితో వదిలేశారు.

మరోవైపు మూసీపై బ్రిడ్జిలు నిర్మించే చోట భూసేకరణను చేయకుండా మూసీకి ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా సమస్యకు కారణమైంది. ఈ బ్రిడ్జిల్లో మూసారంబాగ్, చాదర్‌ఘాట్, ఇబ్రహీంబాగ్, అత్తాపూర్ నాలుగుచోట్ల రూ.168 కోట్లతో జీహెచ్‌ఎంసీ, మిగతా 11 చోట్ల రూ.377 కోట్లతో హెచ్ ఎండీఎ నిధులతో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలను సిద్ధం చేశారు.

ఈ ప్రభుత్వ హయాంలోనైనా అభివృద్ధ్దిజరిగేనా
ఇదే క్రమంలో గత నెల 30న అసెంబ్లీ ఎన్నికల జరగడం, డిసెంబర్ 3న కాంగ్రెస్ విజయం సాధించడం ఆ తర్వాత 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం జరిగిపోయింది. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్క్రమార్కతో కలిసి ఇటీవలే పలువురు మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఇందులో భాగంగా మూసీనదీ వెంట బ్రిడ్జిలు, కమర్షియల్, షా పింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, హాకర్ జోన్‌లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్ షిప్ వి ధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు ఉండాలన్నారు. దీంతో ఈ పనుల్లో నిమగ్నమైన అధికారులు ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. అ యితే ఈ ప్రభుత్వ హయాంలోనేనైనా మూసీ రుపు రే ఖలు మారేనానని నగరవాసులు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News