Saturday, December 21, 2024

సంగీత దర్శకుడు బప్పి లహరి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Music Director Bappi Lahiri Passed away

 

ముంబై: గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి కన్నుమూశారు. 69 ఏండ్ల బప్పి లహిరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ముంబైలోని దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1980, 90వ దశకాల్లో తన డిస్కో మ్యూజిక్‌తో భారతీయ సినీపరిశ్రమను ఒక ఊపుఊపేశారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్‌, షరాబీ వంటి చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. బప్పి లహరి తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సింహాసనం, స్టేట్‌ రౌడీ, సామ్రాట్‌, గ్యాంగ్‌ లీడర్‌, రౌడీగారిపెళ్లాం, చిత్రాలకు ఆయన మ్యూజిక్‌ అందిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News