Monday, January 20, 2025

రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు చేశాడు. తన తనయుడు వైష్ణవ్ ను ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఆర్ పి తనయుడు వైష్ణవ్ ఎంబిఎ చదువుతున్నాడు. అదే కాలేజీలో సీనియర్ విద్యార్థి శ్యామ్ బస్సులో వైష్ణవ్ తో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య మాటమాట పెరగడంతో ఆవేశంలో వైష్ణవ్ చెవిని శ్యామ్ కొరికాడు. గురువారం రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు చేయడంతో శ్యామ్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News