Monday, December 23, 2024

మ్యూజిక్ టీచర్‌గా చేశా

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియాశరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం మ్యూజిక్ స్కూల్. పాపారావు బియ్యాల (మాజీ ఐఏఎస్ అధికారి) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అంది ంచారు. ఈ సినిమా ఈనెల 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా శ్రియా శరణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ మూవీలో మ్యూజిక్ టీచర్‌గా చేశాను. ఇది కేవలం అవార్డులు, రివార్డుల కోసం తీసిన చిత్రం కాదు. కమర్షియల్‌గా ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్లను ప్రోత్సహిస్తే ఎలా జీవితంలో పైకి వస్తారు… అనే అంశాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కనెక్టింగ్‌గా ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News