Sunday, December 22, 2024

జులై, ఆగస్టులో మ్యూజిక్ పనులు షురూ

- Advertisement -
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బా బు హీరోగా ‘ఎస్‌ఎస్‌ఎంబి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కనున్న తెలిసిందే. ఈ మూవీతో మహేష్ బాబు మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తారంటూ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దీన్ని అడ్వెంచర్ మూవీగా తీర్చిదిద్దనున్నారు. ఈ మూవీపై సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తాజాగా ఇచ్చిన అప్‌డేట్ వైరల్ అవుతుంది. ఇంతకీ, కీరవాణి ఏం చెప్పారంటే?.. ‘నేనిప్పటి వరకూ ఈ సినిమా సంగీత పనులు ప్రారంభించలేదు. ఎందుకంటే వారం రోజుల క్రితమే స్టోరీ లాక్ అయింది.

జులై లేదా ఆగస్టులో మ్యూజిక్ వర్క్ ప్రారంభిస్తా. మహేష్ బాబు మీద రాజమౌళి టెస్ట్ షూట్ కూడా చేస్తున్నారని’ అని అన్నారు. కాగా ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో మాత్రం మహేష్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తాడట. సూపర్ స్టైలిష్‌గా హాలీవుడ్ హీరో రేంజ్‌లో మహేష్ లుక్ ఉంటుందట. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News