Saturday, November 16, 2024

ట్విట్టర్ యూజర్లకు మస్క్ మరో షాక్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ట్విట్టర్ యూజర్లకు మస్క్ మరో షాక్ ఇచ్చారు. ఎస్‌ఎంఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఎ) భధ్రత ఇకనుంచి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఇస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ యూజర్ల అకౌంట్లకు రెండంచెల సైభర్ భద్రత కల్పించేందుకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా యూజర్లు తమ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే పాస్‌వర్డ్‌తోపాటు ఎస్‌ఎంఎస్, అథెంటికేషన్ యాప్ లేదా సెక్యూరిటీ పాస్‌వర్డు అవసరం. ఇప్పటివరకూ ఈ సదుపాయాలను ట్విట్టర్ ఉచితంగానే అందించింది.

అయితే ఇక ఎస్‌ఎంఎస్ అథెంటికేషన్‌కు ఛార్జీలు వసూలు చేయాలని నిరయించింది. త్వరలో ఈ విధానం అమలుకానుంది. ఎస్‌ఎంఎస్ ఆధారిత అథెంటికేషన్‌ను బాట్ అకౌంట్లు దుర్వినియోగపరుస్తున్నాయని, ట్విట్టర్ తాజాగా తన బ్లాగ్‌లో ఆరోపించింది. బాట్లతో సంస్థకు ప్రతి ఏటా డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందనితెలిపింది. కాగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్రవేశపెట్టిన ట్విట్టర్..చందాదారులకు బ్లూటిక్ మార్కు కేటాయించడంతోపాటు ట్వీట్ చేశాక ఎడిట్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. అదేవిధంగా ట్వీట్‌లో పదాల పరిమితి పెంపునకు ఆమోదం తెలిపింది. గతంలో కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కల్పించే బ్లూటిక్ ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారందరికి లభిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News