Monday, December 23, 2024

మస్క్ బంపర్ ఆఫర్.. 20 బిలియన్ డాలర్ల విలువచేసే స్టాక్స్‌ ఉద్యోగులకు..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇప్పుడు షాకింగ్ వార్తను వినిపించారు. అనూహ్యంగా వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువచేసే స్టాక్స్‌ను ఉద్యోగులను ఇస్తానని ట్విట్టర్ సిఇఒ మస్క్ ప్రకటించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.

గత ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. ఇప్పుడు ఉద్యోగులకు దానిలో సగం ఆఫర్ చేస్తుండండం గమనార్హం. మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని, ఇప్పటికే ఉద్యోగులను తొలగించగా, అనేక మంది నిపుణులు కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. వీరిని అడ్డుకునేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంతమేరకు స్టాక్స్‌ను ఇస్తారు అనేది స్పష్టంగా చెప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News