Friday, November 22, 2024

బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం తల్లి

- Advertisement -
- Advertisement -

లక్నో: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశమంతా రామనామంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ జైశ్రీమ్ అంటూ మార్మోగిపోయింది. దేశంలో ప్రజలు రామనామం జపించారు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజీత్ ముహూర్తంలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. కొందరు ముఖ్యమైన పనులను కూడా ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. గర్భిణీలు పట్టుబట్టి ఇదే ముహూర్తానికి ఆపరేషన్లు చేసుకోవడంతో పాటు సాధారణ ప్రసవాలు చేయించుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఫిరోజాబాద్‌లో ఫర్ఖానా అనే ముస్లిం మహిళ మగబిడ్డను ప్రసవించింది.

తన బిడ్డకు రామ్ రహీమ్ అనే పేరును నామకరణం చేసింది. హిందూ-ముస్లింల ఐక్యత వర్ధల్లాలని తన బిడ్డకు రామ్ రహీమ్ అనే పేరు పెట్టానని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారు. యుపిలో కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ ఆస్పత్రిలో సోమవారం 25 కాన్పులు జరిగాయని వైద్యుల పేర్కొన్నారు. ఈ కాన్పులలో పది మంది బాలికలు జన్మించారని వైద్యులు వెల్లడించారు. తమ పిల్లలకు రాము, రాముడు, రామా, రాఘవ్, రాఘవేంద్ర, రఘుతో పాటు ఆడ పిల్లలకు సీతా, జానకి అనే పేర్లు నామకరణం చేశారు. ప్రైవేట్ నర్సింగ హోమ్‌లో డెలివరీ రూమ్ లోపల చిన్న రామాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రసవానికి ముందు గర్భిణీలకు శ్రీరాముడి దర్శనం కల్పించి అనంతరం కాన్పు చేశామని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News