Monday, December 23, 2024

తల్లిదండ్రుల హత్యకు దారి తీసిన కొడుకు ప్రేమ పెళ్లి

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌లో అబ్బాస్, కమ్రూల్ నిషా అనే ముస్లిం దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కుమారుడు షౌకత్, రూబీ అనే హిందూ బాలికను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడమే ఈ జంట హత్యలకు దారి తీసింది. రూబీ తండ్రి రాంపాల్ మరో నలుగురు కలిసి షౌకత్ తల్లిదండ్రులను ఇనుపరాడ్‌లు, కర్రలతో దారుణంగా కొట్టి చంపినట్టు పోలీస్‌ల దృష్టికి వెళ్లింది. దీంతో రూబీ తండ్రి రాంపాల్ సహా మరో ఇద్దరు నిందితులను అదుపు లోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

షౌకత్, రూబీ కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. షౌకత్, రూబీ మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారి తీసింది. అయితే వీరి పెళ్లికి రూబీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో 2020 లో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటికి రూబీ మైనర్ కావడంతో రూబీ తండ్రి ఫిర్యాదుపై పోలీస్‌లు షౌకత్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన షౌకత్ , ఇప్పుడు రూబీ మేజర్ కావడంతో మరోసారి రూబీని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దీంతో రూబీ తల్లిదండ్రులు కక్ష పెంచుకుని షౌకత్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News