Thursday, January 23, 2025

టిటిడికి ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

Muslim couple donated Rs 1.02 crore to Tirumala

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెన్నైకి చెందిన ఓ ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల విరాళం అందించారు. మంగళవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని కలిసి ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో చెక్కును అందజేశారు. ఈ మొత్తంలో రూ.15 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లోని కిచెన్‌లో కొత్త ఫర్నిచర్, ఆర్టికల్స్ కోసం 87 లక్షలు. అనంతరం టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు అబ్దుల్ ఘనీ, కుటుంబసభ్యులకు ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఆలయానికి అబ్దుల్ ఘనీ అనే వ్యాపారవేత్త విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. కాగా, సోమవారం దాదాపు 67,276 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ హుండీకి రూ.5.71 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News