Sunday, December 22, 2024

ఆగ్రాలో ముస్లిం కుటుంబంపై దుండగుల దాడి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక ముస్లిం కుటుంబంపై నలుగురు యువకులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్‌ను, వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు కుటుంబ సభ్యులను కొట్టారని, 18 ఏళ్ల బాలికపై దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ యుమున పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేసే ఆ ముస్లిం కుటుంబ యజమాని కథనం ప్రకారం విశాల్ కుమార్, సంజయ్ కుమార్, షీలు, చోటు అనే నలుగురు యువకులు మరికొందరిని వెంటపెట్టుకుని ఇంటిపై దాడి చేశారు. నిందితులందరూ 20 నుంచి 30 ఏళ్ల లోపు వారే. తమ ఇంటిపై రాళ్లు రువ్వారని, ఇంట్లోని ఫర్నీచర్‌తోపాటు వాహనాలను ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. తన కుమార్తెను, ఇద్దరు కుమారులను కొట్టి గాయపరిచారని ఆయన తెలిపారు. మొత్తం కుటుంబాన్నే అంతం చేస్తామని దుండగులు బెదిరించినట్లు ఆయన తెలిపారు. 30 నిమిషాల పాటు ఈ విధ్వంసకాండ కొనసాగిందని, తమది ప్రముఖ ముస్లిం కుటుంబం కావడంతోనే ఈ దాడి జరిగిందని ఆయన కుమారుడు తెలిపారు.

ఈ సంఘటనను ధ్రువీకరించిన డిసిపి సూరజ్ కుమార్ రాయ్ నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News