Thursday, January 23, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 11 మంది ముస్లిం బాలికల అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన 11 మంది ముస్లిం బాలికలను ప్రభుత్వ రైల్వే పోలీసులు(జిఆర్‌పి), రైల్వే రక్షణ దళం(ఆర్‌పిఎఫ్), మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఎహెచ్‌టి) పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా అరెస్టు చేసినట్లు మజ్లిస్ బచావో తెహ్రీక్(ఎంబిటి) అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఆరోపించారు. అరెస్టయిన బాలికలు హఫీజ్ బాబా నగర్, సంతోషనగర్, చాంద్రాయణగుట్టకు చెందిన వారని ఆయన చెప్పారు.

ఖమ్మం జిల్లాలో ఒక వేడుకలో పాల్గొని జూన్ 12వ తేదీన 25 మంది ముస్లిం బాలికలు రైలులో సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన వెంటనే జిఆర్‌పి, సిఆర్‌పిఎఫ్, ఎహెచ్‌టి సిబ్బంది వారిని చుట్టుముట్టినట్లు బాధిత బాలికల బంధువులు తెలిపారు. వారి బ్యాగులను తనిఖీ చేసిన అధికారులు వారిని ప్రశ్నించారని చెప్పారు.

బాలికలు తమ టెయిన్ టిక్కెట్లు, ఆధార్ కార్డులను చూపించినప్పటికీ అధికారులు వారిని అంబర్‌పేటలోని జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సెంటర్‌కు అప్పగించారని బాధితుల బంధువులు చెప్పారు. తనను కలిసిన బాధిత బాలికల బంధువులతో మాట్లాడిన ఎంబిటి ప్రతినిధి అంజద్ వెంటనే ఆ బాలికలను విడుదల చేయాలని అధికారులను కోరారు. బాలికలు విడుదలైన అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

కాగా..అంజద్ ట్వీట్‌కు ఆర్‌పిఎఫ్ సికింద్రాబాద్ బుధవారం స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని జిఆర్‌పి కంట్రోల్‌ను ఆదేశించినట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News