Monday, January 20, 2025

జేడీ(ఎస్)కు ఎదురు దెబ్బ.. సీనియర్ ముస్లిం నేత రాజీనామా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక లోని జనతాదళ్ సెక్యులర్‌జేడీ (ఎస్) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఇటీవల ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరిన నేపథ్యంలో సీనియర్ ముస్లిం నేత సయ్యద్ షఫీపుల్లా జేడీ(ఎస్)కు రాజీనామా చేశారు.

కర్ణాటక జేడీ(ఎస్) ఉపాధ్యక్షునిగా ఉంటున్న సయ్యద్ వర్గాలు, కులాల మధ్య చీలికలు తెచ్చే బీజేపీలో జేడీఎస్ చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా జేడీఎస్‌తోనే ఉన్నానని, తమ పార్టీ సెక్యులర్ అన్న భావన ఉండేదని, ఇప్పుడు తమ పార్టీ వర్గాలు, కులాల మధ్య చీలికలు తెచ్చే , మతపరమైన ఎజెండాను ప్రచారం చేసే బీజేపీతో చేతులు కలిపిందని, ఈ నేపథ్యంలో తాను కొనసాగడం చాలా కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News