Sunday, December 22, 2024

లవ్ జిహాద్ పేరిట దారుణం: ముంబైలో ముస్లిం యువకుడిపై దాడి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

ముంబై: బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద ఒక హిందూ బాలికతో మాట్లాడినందుకు ఒక ముస్లిం యువకుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటన ఈ ఏడాది జులైలో జరగగా ఇందుకు సంబంధించిన వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్, సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే రయీజ్ షేక్ వెంటనే ఈ ఘటనపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించిన ఒక యువకుడిని కొందరు వ్యక్తులు దూషించడంతోపాటు దారుణంగా కొట్టడం ఈ వీడియోలో కనిపించింది. కొట్టడం ఆపాలంటూ బురఖా ధరించిన ఒక బాలిక ఆ దుంగడులను వేడుకోవడం కూడా ఈ వీడియోలో కనిపించింది. జైశ్రీరాం నినాదాలు చేస్తూ ఆ వ్యక్తులు లవ్ జిహాద్ ఆపాలి అంటూ నినాదాలు ఇవ్వడం కూడా ఈ వీడియోలో కనిపించింది.

బాంద్రా స్టేషన్ వద్ద లవ్ జిహాద్ పేరుతో హిందూత్వ గూండాలు ఒక నిరాయుధుడైన ముస్లిం బాలుడిని చితకబాదారంటూ పఠాన్ ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ రోజు మనం 77 ఏళ్ల స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుంటున్నామని, ఇలాంటి రోజును ముస్లింలు చూడాల్సి వస్తుందని మన స్వాతంత్య్రయోధులు ఊహించి ఉండరని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటన రైల్వే పోలీసుల పరిధిలో జరిగినందున దీనిపై ముంబై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదని ముంబై డిఎస్‌పి దీక్షిత్ గెడంను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. కాగా.. ఈ వీడియో మంగళవారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కేసు నమోదు ప్రక్రియ ప్రారంభించామని రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News