Thursday, August 29, 2024

అస్సాంలో ఇప్పుడు ముస్లిం జనాభా 40 శాతం

- Advertisement -
- Advertisement -

దిస్పూర్: అస్సాంలో జనాభా నిష్పత్తి మారుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అస్సాంలో నేడు ముస్లిం జనాభా 40 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రంలో జనాభా నిష్పత్తి మారిపోతున్నఅంశం నాకో సమస్యగా తయారయింది. నేడు అస్సాంలో ముస్లింల జనాభా 40 శాతం. 1951లో 12 శాతం మాత్రమే ఉండేది. మనం చాలా జిల్లాలను పోగొట్టుకున్నాం. ఇది నాకు రాజకీయ అంశం కాదు. ఇది నాకు చావో రేవో వంటి సమస్య’’అని ఆయన తెలిపారు.

అస్సాంలో మత ఘర్షణలకు కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలే కారణమన్నారు. అస్సాంలో మొత్తం 14 లోక్ సభ సీట్లుండగా, బిజెపి, ఏజిపి, యుపిపిఎల్ సంకీర్ణం 11 సీట్లు గెలుచుకుంది. మిగతా మూడింటిని కాంగ్రెస్ గెలుచుకుంది.

‘‘ మాది రాజకీయ ఓటమి కాదు. ఓ మత వర్గం వారు  మా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకం. పైగా వారి మతస్థులు చాలా మందే రాష్ట్రంలో ఉన్నారు. అదే పనిచేసింది. అందుకే తేడా వచ్చింది. ఎవరూ మతానికి వ్యతిరేకంగా పోరాడలేరు’’ అని బిశ్వ శర్మ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News