Thursday, January 9, 2025

సర్వేను బహిష్కరించిన మసీదు కమిటీ

- Advertisement -
- Advertisement -

వారణాసి : 17వ శతాబ్ధపు వారణాసి జ్ఞానవాపి మసీదు ఆవరణలో శుక్రవారం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) తన సర్వే పనిని చేపట్టింది. సర్వే విషయంలో సుప్రీంకోర్టు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. అయితే ఇక్కడి మసీదు నిర్వాహక వ్యవహారాల అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులు తాము ఈ సర్వేను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో శుక్రవారం ఉదయం ఎఎస్‌ఐ బృందం, హిందూ పక్షం ప్రతినిధులు ఈ వివాదాస్పద ప్రాంతానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ చేరుకున్నారు.

సర్వే బృందం వెంబడి నిజానికి అంజుమన్ కమిటీ సభ్యులు కూడా వెళ్లాల్సి ఉంది. కానీ వీరు వెళ్లలేదు. మొత్తం 43 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరుకుంది. శుక్రవారం మసీదులో నమాజులు ఉండటంతో మధ్యాహ్నం 12 గంటలకే తమ పనిని ముగించారు. సర్వే పనులు ఐదురోజులు సాగుతాయని హిందూ పక్షం లాయర్‌లలో ఒక్కరైన మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. తమ పక్షం వారు ఈ సర్వే పనుల సందర్భంగా హాజరయ్యేది లేదని అంజుమన్ మసీదు కమిటీ కార్యదర్శి సయ్యద్ మెహమ్మద్ యాసిన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News