Sunday, December 22, 2024

మోడీని పొగిడినందుకు తలాక్!

- Advertisement -
- Advertisement -

బహ్రెయిచ్: యూపి లో ఓ ముస్లిం మహిళ అయోధ్యలో జరిగిన అభివృద్ధికి ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కారణమంటూ ప్రశంసించింది. దాంతో చిర్రెత్తిన ఆమె భర్త మూడుసార్లు ‘తలాక్’ చెప్పేశాడు. అంతేకాక ఆమె వీపు విమానం మోత మోగించాడు.  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది, దాంతో ఆమె భర్త మీద, ఆయన కుటుంబ సభ్యులపైన కేసులు నమోదు చేశారు.

బహ్రెయిచ్ జిల్లా మొహల్లా సరాయ్ కి చెందిన బాధితురాలికి గత ఏడాది డిసెంబర్ లో అయోధ్యకు చెందిన అర్షద్ తో వివాహం జరిగింది. ఆమె అత్తింటికి వెళ్లాక అయోధ్యలో రోడ్లు, ఆ నగరం, వాతావరణం ఆమెకు నచ్చాయి. దాంతో ఆమె మోడీని, యోగిని మెచ్చుకునేసరికి ఆమె భర్తకు చిర్రెత్తింది. దాంతో తలాక్ చెప్పేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News