Friday, January 3, 2025

తీవ్రవాదుల తూటాలకు బలైన కశ్మీరీ పండిట్ పాడె మోసిన ముస్లింలు

- Advertisement -
- Advertisement -

పుల్వామా(కశ్మీరు): తీవ్రవాదుల దాడిలో మరణించిన కశ్మీరీ పండిట్ కుటుంబానికి అండగా నిలబడిన స్థానిక ముస్లింలు పాడె ఎత్తి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జమ్మూ కశ్మీరు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ శర్మను ఆదివారం ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ హత్యతో పుల్వామా జిల్లాలోని అచన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శర్మ భార్య, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు ఇరుగుపొరుగున నివసించే ముస్లిం కుటుంబాలను కూడా చాలింపచేశాయి.

ఈ హత్యను తీవ్రంగా ఖండించిన ముస్లిం కుటుంబాలు శర్మ కుటుంబానికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చాయి. గత 33 ఏళ్లలో వందలాది మంది ముస్లింలు, ముస్లిమేతరులు తీవ్రవాదుల తూటాలకు బలైపోయారని, ఈ అవివేక హింసకు వేలాది కుటుంబాలు నాశనమైపోయాయని అఫ్జల్ అనే వ్యక్తి వాపోయాడు. శర్మ అంంతియాత్రలో పాల్గొన్న ముస్లింలు పాడె కూడా మోయడంతోపాటు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన అంతిమసంస్కారాలకు అండగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News