మన తెలంగాణ,సిటీబ్యూరో: దీపావళి కేవలం టపాకాయల పండగేకాదు, రంగు, దీపాల పండుగ, మనం ప్రయత్నించి సురక్షితంగా, ఆరోగ్యవంతంగా మన చుట్టుపక్కల ఉన్నవారితో పాటు, పర్యావరణం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు డా. అనుభా రాఠీ పేర్కొన్నారు. టపాకాయలు కాల్చే సమయంలో ప్రతి బిడ్డను పెద్దవారు ఒకరు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. టపాకాయలు కాల్చేటప్పుడు అధీకృత ఉత్పాదకుల నుంచి తీసుకోవాలని, ఆడుకునే సమయంలో పిల్లలను ఒంటరిగా వదలకూడదు, ఒక సమయంలోనే ఒకే వ్యక్తి టపాకాయలను వెలిగించాలని, మిగిలిన వారు సురక్షితమైన దూరం నుంచి చూడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కాల్చలాని, వెలిగించేటప్పుడు ఒక పొడవైన కొవ్వొత్తి, కాకరపు కొవ్వొత్తిని ఉపయోగించాలని, దగ్గరలో రెండు బకెట్ నీళ్లు ఉంచుకుని, కాలితే కాలినచోట చాలా నీరు పోయాలని సూచించారు. తీవ్రమైన కాలినగాయాలకు మంట ఆర్పిన తరువాత ఆవ్యక్తిని ఒక శుభ్రమైన దుప్పటిలో చుట్టి, వెంటనే ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు.
దీపావళి సమయంలో సురక్షితంగా ఉండాలి: డా. అనుభా రాఠీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -