Wednesday, November 6, 2024

నగరంలో గంజాయి లేకుండా చేయాలి

- Advertisement -
- Advertisement -

Must do without marijuana in Hyderabad

దానికి స్థానికులు సహకరించాలి
గంజాయికి అడ్డాగా మారుతున్న ధూల్‌పేట్
నషా ముక్త్ హైదరాబాద్ కార్యక్రమం
పాల్గొన్న నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: నగరంలో గంజాయి లేకుండా చేయాలని, దీనికి స్థానికులు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నషా ముక్త్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ధూల్‌పేటలో శనివారం వెస్ట్‌జోన్ పోలీసులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ ధూల్‌పేట గంజాయికి హబ్బుగా మారుతోందని అన్నారు. నగరంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా దానిమూలాలు ధూల్‌పేటలో ఉంటున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయి వల్ల యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. యువకులు, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు బానిసగా మారి జీవితంలో సర్వం కోల్పోతున్నారని అన్నారు.

గంజాయి విక్రయించే వారు న్యాయపరంగా ఇబ్బందులు పడుతారని అన్నారు. హైదరాబాద్ పోలీసులు గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజల బాగు కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి ధూల్‌పేట సరైన వేదికని అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, వెస్ట్‌జోన్ జాయింట్ సిపి ఎఆర్ శ్రీనివాస్, ఎడిసిపి ఎండి ఇక్బాల్ సిద్ధీఖీ, ఎడిసిపి నరేందర్ రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి అంజిరెడ్డి, ధూల్‌పేట ఎక్సైజ్ ఇన్స్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, మంగళ్‌హాట్ ఇన్స్‌స్పెక్టర్ నరేందర్, డిఐ సైదాబాబు, 250మంది స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News