Sunday, November 17, 2024

మాట కాదు.. రాసివ్వాలి

- Advertisement -
- Advertisement -

Must give written guarantee of purchase of grain

రాజకీయాల కోసం రాలేదు, రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాం

ఏవో సాకులు చెబుతూ కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్
అపాయింట్‌మెంట్
ఇవ్వడంలేదు మమ్మల్ని
నిరీక్షించేలా చేయడం అంటే
తెలంగాణ రైతులను
అవమానించడమే కేంద్రం
నుంచి పిలుపు వచ్చేవరకూ
ఇక్కడే వేచి చూస్తాం : ఢిల్లీలో
వ్యవసాయ శాఖ మంత్రి
నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం మాట ఇవ్వడమే కాదు.. లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న అనేక హామీలు అమలు కావడంలేదని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను కేంద్రం రాజకీయ కోణంలో చూడడం మానేసి రైతుల దృష్టితో చూడడం అలవరుచుకోవాలని ఆయన హితవు పలికారు. రైతుల ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చామన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్ర రైతుల గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తాము ఢిల్లీకి వచ్చామన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు, నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమాలకర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ తదితరులతో కలిసి సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే ఎక్కువ తీసుకోవడంపై రాత పూర్వక ప్రకటన ఇవ్వాలన్నారు.

ఢిల్లీకి వచ్చే ముందే కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోరామన్నారు. కానీ ఏదో సాకులను చెబుతూ ఇప్పటి వరకు తమకు కలిసేందుకు అవకాశం దక్కలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. తమను నిరీక్షించేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమేనని అన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే కేంద్ర మంత్రి తగుసమయం కేటాయించి రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కేంద్ర మంత్రి నుంచి పిలుపు వచ్చేంత వరకు తమ బృందం వేచి చూస్తుందన్నారు. రైతాంగానికి సంబంధించిన అంశాల మీద రాష్ట్రాల నుండి ఎవరు వెళ్లినా గతంలో కేంద్ర మంత్రులు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారించే వారన్నారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో అలా జరగడం లేదన్నారు. ఈ పద్దతి పూర్తిగా అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతుల నుంచి ధ్యానం సేకరణ కోసం ప్రభుత్వం 6,952 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా ్ల 12-15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

ఇంకా కొన్ని జిల్లాల్లో వరి కోతలు జరగాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకాలకు సిద్దంగా ఉందని చెప్పారు. అందుకనే కేంద్రప్రభుత్వానికి వారి కోనుగోలు టార్గెట్ పెంచమని కోరామన్నారు. రాష్ట్రంలోజనవరి 15 వరకు వానాకాలం వరి కోతలు జరుగుతాయన్నారు. మరో ఐదు లక్షల ఎకరాల్లో పంట కోతకు రావాల్సి ఉందని మంత్రి వివరించారు. ఏడాదిలో కేంద్రం ఎంత ధాన్యం తీసుకుంటారో చెప్పాలని సిఎం కెసిఆర్ చాలా స్పష్టంగా అడిగారన్నారు. దీనిపై కేంద్రం ఎప్పటికప్పుడు డొంక తిరుగుడు సమాధానం చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతుల నుంచి సేకరించిన బియాన్ని నేరుగా ఎగుమతి చేసే అధికారం రాష్ట్రానికి లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులు మాత్రమే ఎగుమతి చేయగలరన్నారు. కానీ విశాఖ పోర్టు వరకు వెళ్లి ఎగుమతి చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం ఇక్కడకు రావాల్సి వచ్చిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News