Wednesday, January 22, 2025

జీఎస్టీ ,వ్యాపార పరమైన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: టాక్స్ ప్రాక్టీషనర్స్‌లు జీఎస్టీ విధానం తో పాటు రేరా యాక్ట్, ఇతర వ్యాపార పరమైన చట్టాలపై సంపూర్ణ అ వగాహన కలిగి ఉండాలని అదనపు కమీషనర్, తెలంగాణ వ్యాట్ అ ప్పీలేట్ ట్రిబ్యునల్ డిపార్ట్‌మెంట్ మెంబర్ కె సీతాలక్ష్మిఅన్నారు. ఈ మేరకు గన్‌ఫౌంఢ్రి సూ ర్యలోక్ కాంప్లెక్స్‌లోని తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన 20వ వార్షిక కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు కమీషనర్ సీతాలక్ష్మి మాట్లాడుతూ టాక్స్ ప్రాక్టీషనర్స్ నిబద్దత, నిజాయితీ తో అందిస్తున్న సేవలు దేశ ఆర్థిక పురోభివృద్దికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.

అంతకుముందు రిటైర్డ్ డిప్యూటీ కమీషనర్ సుబ్బారా వు నూతనంగా ఎన్నికైన తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శి పి గోపాల్, కోశాధికారి కె హుస్సేన్ వలి, ఉపాధ్యక్షులు కెవి రమణమూర్తి, బి దుర్గా ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు జి నాగరాజు, వి వెంకట రమణ, కార్యవర్గ స భ్యులు ఎ రమేష్ బాబు, సిహెచ్ శ్రీనివాసరావు, ఆర్ సాధు రమణారా వు, సిహెచ్ శ్రీనివాస్, అజయ్‌కుమార్‌లచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టాక్స్ ప్రాక్టీషినర్స్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటూనే మన సంస్థ పురోగతికి, దేశ ఆర్థికాభివృద్దికి పాటుపడా లని నూతనంగా ఎ న్నికై న కార్యవర్గ సభ్యులకు సూచించారు.

నూతన కార్యవర్గ సభ్యులకు అభినందన లు తెలియజేస్తూ, సభ్యులందరి సహకారంతో అసొసియేషన్‌ను ముం దుకు నడిపించాల్సిన బాధ్యత నూతనంగా పదవీబాధ్యతలు చేపట్టిన అధ్యక్ష, కార్యదర్శులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టాక్స్ ప్రాక్టీష నర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రంగి నరేష్, ప్ర ధాన కార్యదర్శి సిద్దంశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారి నెమ్మాని సోమే శ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News