Sunday, April 13, 2025

హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఇక తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అ న్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేసింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేటు కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జా రీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రి జిస్టరైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెం బర్లు ప్లేట్లు లేకపోతే బండి సీజ్ చేయడంతో పా టు కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ హె చ్చరించింది. నెంబర్ ప్లేట్ల కోసం www.siam. in వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 30వ తేదీవరకు గడువు ఇచ్చిం ది. గడువు ముగిసిన తర్వాతే కేసులు నమోదు చేయడం, బండి సీజ్ చేయడం వంటివి చేస్తామని రవాణాశాఖ స్పష్టం చేసింది.

హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు ఇన్యూరెన్స్, పి యూసీ సర్టిఫికెట్‌లను జారీ చేయకుండా నిబంధనలు విధించింది. దీనికి సంబంధించి రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ జిఓ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొని ఈ నెంబర్‌ప్లేట్లకు సంబంధించి సవరణలు చేసినట్టు రవాణాశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెంబర్‌ప్లేట్లకు సం బంధించి ధరలను కూడా రవాణాశాఖ నిర్ణయించింది. ద్విచక్ర వాహనాలకు రూ.320 నుంచి రూ.380లు, ద్విచక్రవాహనం (ఇంపార్టెంట్)కు రూ.400ల నుంచి రూ.500లు, నాలుగుచక్రాల వాహనాలకు రూ.590 నుంచి రూ.700లు, నా లుగుచక్రాల వాహనాలు (ఇంపార్టెంట్)కు రూ. 700ల నుంచి రూ.800లు, త్రీ వీలర్స్ వాహనాలకు రూ.350 నుంచి రూ.450లు, కమర్షియల్ వాహనాలకు రూ.600ల నుంచి రూ.800లను చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి అల్యూమినియం, రిట్రో రిఫ్లెక్టివ్ షీట్లతో తయారు
హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లను భారత దేశంలోని వాహనాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇవి లైసెన్స్ ప్లేట్. దీనిని అల్యూమినియం, రిట్రో రిఫ్లెక్టివ్ షీట్లతో తయారు చేస్తారు. ఈ నెంబర్ ప్లేట్లు వాహన భద్రతను మరింత పెంచుతాయని కేంద్రప్రభుత్వం పేర్కొంటోంది. నకిలీ నెంబర్ ప్లేట్‌లను నిరోధించడానికి, వాహన సంబంధిత నేరాలను అరికట్టడానికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న ప్లేట్లతో పోల్చుకుంటే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రానిక్ వాహనంతో లింక్ అయ్యి ఉంటాయి. ఈ వివరాలు ఆటోమెటిక్‌గా ప్రభుత్వం వద్ద ఉన్న డేటా బేస్‌లో స్టోర్ అవుతాయి. దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అల్యూమినియంతో తయారు చేసిన ఈ ప్లేట్లకు రిట్రో రిఫ్లెక్టివ్ షీట్‌తో లాటమినెట్ చేస్తారు. అందుకే ఈ నెంబర్ ప్లేట్లు రాత్రివేళల్లో కూడా మెరుస్తూ ఉంటాయి.

వాహనం గుర్తించడం చాలా సులభమవుతుంది. ఈ ప్లేట్లకు అశోక చక్ర హోలోగ్రామ్ ఉంటుంది. ప్లేట్ పైన ఎడమవైపు 20mm X 20mm కొలతలతో ఈ హోలోగ్రామ్ ఉంటుంది. ఇది క్రోమియంతో తయారు చేస్తారు. దీనికి నకిలీ తయారు చేయడం చాలా కష్టం. తయారు చేసినా ఈజీగా గుర్తించవచ్చు. ఈ ప్లేట్‌కు కింది భాగంలో ఎడమవైపు పది అంకెల శాశ్వత గుర్తింపు పిన్ ఉంటుంది. దీనిని లేజర్ టెక్నాలజీతో రూపొందిస్తారు. రెండు నాన్ రీయూజబుల్ స్నాప్ లాక్‌లతో వాహనానికి దీనిని ఫిట్ చేస్తారు. ఇవి తొలగించడం మార్చడం అంత ఈజీ కాదు. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనం అయితే అందుకు తగ్గ కలర్ కోడెడ్ స్టికర్‌ను వాహనం విండ్ స్క్రీన్‌కు అతికిస్తారు. పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు నీలం, డీజిల్ వాహనాలకు ఆరెంజ్, ఎలక్ట్రిక్ వాహనానిలకు ఆకుపచ్చ స్టికర్‌లను కేటాయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News