Wednesday, November 6, 2024

హాఫ్ మారథాన్‌లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: హాఫ్ మారథాన్‌లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎస్బి ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డి , సిద్దిపేట రన్నర్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపిరెడ్డిలు అన్నారు. శనివారం ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ డాక్టర్లు, ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు ,వైద్య సిబ్బందితో కలిసి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో రూబీ నెక్లెస్ రోడ్ కోమటి చెరువు వద్ద 5 కె రన్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బి ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డి , సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అద్యక్షులు కత్తుల బాపిరెడ్డిలు మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, పోలీస్ శాఖ సమన్వయంతో సిద్దిపేట రంగ నాయక సాగర్ ప్రాజెక్ట్‌పై హాఫ్ మారథాన్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

సిద్దిపేట , వివిధ జిల్లాల యువతి, యువకులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో ఆసక్తిగల యువతీ యువకులు ఉత్సాహవంతులు హాప్ మారథాన్ రన్నింగ్ పోటిలో పాల్గొనే వారు https://shm23. iq301.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని రన్నింగ్‌లో పాల్గొనే వారందరికి టీషర్ట్ , మెడల్స్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ కాశీనాథ్, సిద్దిపేట జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అద్యక్షులు డాక్టర్ బాస్కర్‌రావు, జాయింట్ సెక్రటరి డాక్టర్ రవికాంత్, పలువరు ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు, మెడికల్ సిబ్బంది త్రీటౌన్ సీఐ భానుప్రకాశ్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పరందాములు, రాజు, రాజిరెడ్డి, పోలీస్ సిబ్బంది. ఉద్యోగ ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News