హైదరాబాద్: నటుడు విజయ్ దేవర్ కొండ, నటి మృణాల్ ఠాకుర్ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఇంటిల్లిపాది చూసి ఆనందించే మంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమా అయినప్పటికీ, సోషల్ మీడియాలో కొందరు కావాలని దానిని వేరే విధంగా విమర్శిస్తుండడం, రివ్యూలు రాయడం వల్ల థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోతోంది. కానీ నిజానికి సినిమా సెమీ-హిట్ కావలసిన సినిమా. కథ, నటన, డైరక్షన్…ఎక్కడా లోపం కనిపించదు.
కథ విషయానికి వస్తే కథానాయకుడు(విజయ్) ఇంటి భారమంతా తన భుజాలపై వేసుకుని నడిపిస్తుంటాడు. వారిదో పెద్ద కుటుంబం. మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కథానాయకురాలు(మృణాల్ పాండే) వారి ఇంటిలోకి అద్దెకి వస్తుంది. కానీ మూడో కంటికి తెలియకుండా, ఎవరికీ అనుమానం కలుగకుండా కథానాయకుడి మీద ‘ది మ్యాన్’ అన్న టైటిల్ తో థిసీస్ రాస్తుంది. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న కథానాయకుడు మండిపడి, మా ఇంటి గుట్టు బజారునకు ఈడుస్తావా, మేము మధ్య తరగతి వాళ్లమే కానీ…పూటకు తిండికి గతిలేని అంత అథమ స్థాయిలో బతకడం లేదంటూ థిసీస్ సమర్పించిన యూనివర్శిటీలోనే ఆమె చెంప పగులకొడతాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లో బాగా పేరున్న వ్యక్తి(జగపతి బాబు) దగ్గరికి వెళ్లి ఉద్యోగం సంపాదించడమేకాక, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ గా అడిగి తీసుకుని అభివృద్ధిలోకి వస్తాడు. కానీ కథానాయకురాలు ఎవరు, ఆ తర్వాత కథా నాయకుడు, కథా నాయకురాలు కలుసుకుంటారా, వారి మధ్య ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.. వగైరా తెరపై చూసి ఆనందించాల్సిందే.
ఎలాంటి లోపం లేని సినిమా మీద ఎందుకు నెగటివ్ టాక్ ప్రచారం జరుగుతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా కారణంగా తప్పుడు ప్రచారం జరుగుతోందనిపిస్తోంది. తప్పక చూడాల్సిన కుటుంబ చిత్రం ఇది.
కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా ఆరు రోజుల్లో(ఏప్రిల్ 10, బుధవారం వరకు) రూ. 17 కోట్లు మాత్రమే రాబట్ట గలిగింది.
Day 1 [1st Friday] Rs 5.75 Cr
Day 2 [1st Saturday] Rs 3.45 Cr
Day 3 [1st Sunday] Rs 3.1 Cr
Day 4 [1st Monday] Rs 1.3 Cr
Day 5 [1st Tuesday] Rs 2.5 Cr
Day 6 [1st Wednesday] Rs 0.5 Cr ** (as of now)
Total Rs 16.6 Cr
సరైన ప్రచారం జరిగి ఉంటే ఇంకా ఎక్కువ రాబడి సాధించేదే. కొందరు క్రూక్ క్రిటిక్స్ కారణంగా ఈ సినిమాకు ఫుట్ ఫాల్ తగ్గిందనిపిస్తోంది. దర్శకుడు పరశురామ్ పేట్ల బాగానే డైరెక్ట్ చేశాడీ చిత్రాన్ని. ప్రధాన పాత్రలను పోషించిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకుర్ చక్కగానే నటించారు. చూస్తే మీకే అర్థమవుతుంది. నిజానికి ఇది తప్పక చూడాల్సిన సినిమా. కనీసం రెండో వారంలోనైనా పుంజుకోగలదని ఆశిస్తున్నాను. సెమీ హిట్ కావలసిన చిత్రం ఇది. దీనికి ప్రొడ్యూసర్లు దిల్ రాజు, వాసు వర్మ. మ్యూజిక్ గోపి సుందర్, ఈ సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు. ఫోటోగ్రఫీ కూడా సూపర్భ్ గా కనువిందు చేస్తుంది. –రివ్యూ: అశోక్.