ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ : మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ పట్టణంలోని ఏఆర్‌హెడ్ క్వాటర్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… సమాజం ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటుందని అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అనితర బాద్యత పోలీసులపై ఉన్నదని సిబ్బంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజల సేవలో ముందుండాలని అన్నారు.
అలాగే సాయుదదళ విభాగం విధులైనటువంటి విఐపీ సెక్యూరిటీ, ట్రెజరీ సెక్యూరిటీ, ఖైదీలకు ఎస్కార్ట్‌లను అందించడం, కవాతుల్లో, గార్డ్ ఆఫ్ హానర్‌లో పాల్గొనడం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల, అత్యవసర సందర్భంలో రెస్యూ ఆపరేషన్లు చేపట్టడం లాంటి విధులలో సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్కాడ్‌ల పనితీరు, టియర్ గ్యాస్ షెల్స్ వినియోగం, పోలీసు బందోబస్తు మొదలైన అత్యవసర విధులను గురించి అధికారులతో జిల్లా ఎస్పీ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌డిఎస్పీ శ్రీనివాస్, ఆర్‌ఐ అచ్యుతరావు, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావు, ఏఆర్‌ఎస్సై నరేష్, ఏఆర్‌ఎస్సై భవాని కుమార్, ఏఆర్ ఎస్సై మహిపాల్, ఏఆర్ ఎస్సై సుభాష్, ఏఆర్ హెడ్ క్వాటర్ సిబ్బంది పాల్గొన్నారు.