Monday, December 23, 2024

మణిపూర్‌లో మూగపోయిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవాలు మూగబోయాయి. మూడు నెలలుగా జాతుల మధ్య హింస, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు విధ్వంసం తదితర సంఘటనలు చోటు చేసుకోవడంతోపాటు తీవ్ర వాద సంస్థలు సాధారణ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో రాజధాని ఇంఫాల్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా షాపులన్నీ బంద్ అయ్యాయి. ఎలాంటి జనసందోహం లేకుండా వీధులన్నీ ఎడారిని తలపించాయి .

అయితే అధికారిక ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లి జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్నారు. చాలా మంది ఇళ్లకే పరిమితం కావడంతో స్థానికంగా ఎలాంటి వేడుకలు జరగలేదు. రాజధాని నగరంలో గత రెండు రోజులుగా ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. కొంతమంది మాత్రమే హర్‌ఘర్ తిరంగ ప్రచారంలో పాల్గొన్నారు. తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగుర వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News