Thursday, January 23, 2025

రాజమండ్రిలో గోల్డ్ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించిన ముత్తూట్ ఎగ్జిమ్

- Advertisement -
- Advertisement -

రాజమండ్రి: భారీ వ్యాపార సమ్మేళనం ముత్తూట్ పప్పచన్ గ్రూప్ (దీనిని ముత్తూట్ బ్లూ అని కూడా పిలుస్తారు) యొక్క విలువైన లోహపు విభాగం, ముత్తూట్ ఎగ్జిమ్ (P) లిమిటెడ్, తమ నూతన కేంద్రం ను G.S. రావు కాంప్లెక్స్, డోర్ నెంబర్ 6-6-10, గ్రౌండ్ ఫ్లోర్, టి.నగర్, కోటిపల్లి బస్టాండ్ దగ్గర, రాజమండ్రి వద్ద కొత్త ముత్తూట్ గోల్డ్ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ గోల్డ్ పాయింట్ సెంటర్ రాష్ట్రంలో ముత్తూట్ ఎగ్జిమ్ ప్రారంభించిన మూడవ సెంటర్ అవుతుంది. వినియోగదారులకు తమ బంగారాన్ని విక్రయించడానికి విశ్వసనీయమైన, నమ్మకమైన కేంద్రాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసింది.

ఇక్కడ వినియోగదారులు తమ బంగారాన్ని సౌకర్యవంతమైన, పారదర్శక విధానము లో విక్రయించవచ్చు. ఈ కొత్త బ్రాంచ్‌తో, కంపెనీ ఈరోజు భారతదేశంలో 18 గోల్డ్ పాయింట్ సెంటర్‌లను కలిగి ఉంది, ఇందులో రెండు ‘మొబైల్ ముత్తూట్ గోల్డ్ పాయింట్’ సెంటర్లు కూడా వున్నాయి. ఇవి కస్టమర్ల ఇంటి నుండి బంగారాన్ని సేకరిస్తాయి. ముత్తూట్ ఎగ్జిమ్, తమ గోల్డ్ పాయింట్ సెంటర్‌ల ద్వారా, పాత, ఉపయోగించిన బంగారు వస్తువులను నేరుగా వినియోగదారుల నుండి కొనుగోలు చేస్తాయి, తరువాత వాటిని తిరిగి ప్రాసెస్ చేసి, శుద్ధి చేసి, దేశీయ వినియోగానికి సరఫరా చేస్తారు.

ఈ సంస్థ ద్వారా 2015లో కోయంబత్తూరులో మొట్టమొదటి గోల్డ్ పాయింట్ సెంటర్ ప్రారంభించబడింది. అప్పటి నుండి ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, మదురై, విజయవాడ, ఎర్నాకులం (కొచ్చి), నోయిడా, పూణే, హైదరాబాద్, ఇండోర్, విశాఖపట్నం, గుర్గావ్, మైసూరు వంటి ఇతర నగరాలకు విస్తరించింది.

బంగారాన్ని రీసైక్లింగ్‌లోకి తెచ్చిన మొదటి జాతీయ స్థాయి వ్యవస్థీకృత రంగ సంస్థ ముత్తూట్ ఎగ్జిమ్, ఇది దిగుమతులపై భారతదేశం అధిక ఆధారపడటాన్ని తగ్గించడానికి, భారత బంగారు పరిశ్రమ కోసం భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ముంబై & బెంగళూరులో మొబైల్ వ్యాన్‌లను ప్రారంభించడంతో డోర్‌స్టెప్ సర్వీస్‌ను ప్రారంభించిన భారతదేశంలో మొదటి సంస్థ గా కూడా ఇది నిలిచింది. రిటైల్ రీసైకిల్ గోల్డ్ విభాగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది, పారదర్శకత, శాస్త్రీయ అంచనా, ఉత్తమ పద్ధతులతో కస్టమర్‌లు తమ బంగారానికి సరసమైన విలువను పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

ఈ కేంద్ర ప్రారంభోత్సవం గురించి ముత్తూట్ ఎగ్జిమ్ సీఈఓ కేయూర్ షా వ్యాఖ్యానిస్తూ.. “విలువైన లోహాల వ్యాపారంలో రాజమండ్రి కీలకమైన మార్కెట్లలో ఒకటి గా వెలుగొందుతుంది. ఈ ఆశాజనక నగరంలో మా సేవలను అందించడానికి మేము సంతోషిస్తున్నాము. మా సేవలు అవసరమయ్యే మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడానికి ఈ నూతన బ్రాంచ్ మాకు సహాయం చేస్తుంది. ఈ చర్య, మా వినియోగదారులకు పారదర్శకమైన, శాస్త్రీయమైన పరీక్ష, బంగారాన్ని అంచనా వేసే ప్రత్యేక, పరిశ్రమ-మొదటి ప్రక్రియను అందించాలనే మా నిరంతర నిబద్ధతలో భాగం. బంగారం రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తూ, సామాన్యులు తమ ఆస్తిని ఉత్పాదక వినియోగంలో ఉంచడంలో సహాయపడాలనే మా లక్ష్యం ను ఇది ప్రతిబింబిస్తుంది, తద్వారా దేశంలోకి బంగారం దిగుమతులను తగ్గించాలనే భారత ప్రభుత్వ ఆలోచనకు ఇది దోహదపడుతుంది” అని అన్నారు.

ఈ ప్రారంభం యొక్క ప్రాముఖ్యతను ముత్తూట్ పప్పచన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముత్తూట్ ఎగ్జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ముత్తూట్ మాట్లాడుతూ.. “మా పరివర్తన వ్యూహంలో భాగంగా మేము మా అన్ని వ్యాపారాలలో అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకున్నాము. మేము దేశవ్యాప్తంగా మా కార్యకలాపాలను విస్తరిస్తున్న వేళ, ముత్తూట్ పప్పాచన్ గ్రూప్ బలం & భేదం ప్రతి ఒక్క కస్టమర్ అవసరాలు & కోరికల గురించి సన్నిహితంగా అర్థం చేసుకోవడం, అతను లేదా ఆమె జీవితాన్ని ఉన్నతంగా మార్చడంలో సహాయపడటానికి తగిన పరిష్కారాలను రూపొందించడం అనే దాని ప్రధాన తత్వశాస్త్రం నుండి ఉద్భవించింది. ముత్తూట్ ఎగ్జిమ్ మాకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలలో ఒకటి, సామాన్యుల ఆకాంక్షలతో పాటు పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మా విస్తరణ ఉంది . మా లక్ష్యం కు అనుగుణంగా, సామాన్య మానవుని ఆకాంక్షలను సాధించే దిశగా సాధికారత కల్పించడంలో సహాయం చేయడానికి మేము కస్టమర్-కేంద్రీకృత ప్రయత్నాలను చేస్తూనే ఉంటాము” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News