Monday, December 23, 2024

ఆర్‌టిసి చైర్మన్‌గా ముత్తిరెడ్డి బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలో టిఎస్ ఆర్టీసి అగ్రగామి సంస్థగా ఎదిగిందని ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఇటీవల టిఎస్ ఆర్టీసి చైర్మన్ గా నియమితులైన ఆయన బస్‌భవన్‌లో ఆదివారం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఉద్యోగులతో కలిసి పని చేసి సంస్థను నంబర్‌వన్‌గా నిలుపుతానన్నారు. ఒకప్పుడు ఎక్కడుంది తెలంగాణ అనేవాళ్లకు ఇప్పుడు సిఎం కెసిఆర్ గ్లోబల్ సిటీగా మార్చి చూపించారన్నారు.మంత్రి కెటిఆర్ డైరెక్షన్‌లో జనగామను దేశంలోనే టాప్ 3 మున్సిపాలిటీగా తీర్చిదిద్దానన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్రంపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో ఆయl ముఖ్యమంత్రిగా తెలంగాణను కాపాడే క్రమంలో అనేక సంస్కరణలు చేశారని ఆయన పేర్కొన్నారు.

అన్ని విభాగాలను కెసిఆర్ అభివృద్ధి చేశారని ముత్తిరెడ్డి తెలిపారు. కెసిఆర్, కెటిఆర్ సారథ్యంలో పనిచేస్తున్నానని, ఇప్పుడు వారి ఆశీర్వాదంతో ఆర్‌టిసి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని ముత్తిరెడ్డి తెలిపా రు. దక్షత గల ఎండి సజ్జనార్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆర్టీసిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉ ద్యోగులు, కార్మికులకు లాభం చేకూరేలా ప్రభుత్వంతో చర్చించి అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News