సిద్దిపేట: ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. చేర్యాలలోని పెద్ద చెరువు మత్తడి స్థలానికి ముత్తిరెడ్డి కబ్జా చేశారు. ఆ స్థలాన్ని కూతురు పేరుపై ముత్తిరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. స్థలం కబ్జాపై గతంలో విపక్షాలు ముత్తిరెడ్డిపై మండిపడ్డాయి. తన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ముత్తిరెడ్డి కూతురు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన పేరుపై ఉన్న 1270 గజాల స్థలాన్ని మున్సిపాటిలీకి అప్పగిస్తానని ముత్తరెడ్డి కుమార్తె తుల్జాభవాని చెప్పారు. స్థలంలో క్షమాపణ కోరుతూ తుల్జా భవాని బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మా నాన్న ఇలా చేసి ఉంటడాల్సింది కాదని తుల్జాభవాని తెలిపారు. ముత్తిరెడ్డి ఎంఎల్‌ఎ కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉందని, తప్పు జరిగిందని, మా నాన్న చేసిన పనికి క్షమించాలని ఆ గ్రామస్థులను కోరారు. కోర్టు ద్వారా ఆ స్థలాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తానని ముత్తిరెడ్డి కుమార్తె వివరణ ఇచ్చారు.
Also Read: విజయవాడలో పట్టపగలు నడి రోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు