Monday, December 23, 2024

ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.19,705 కోట్లు

- Advertisement -
- Advertisement -

Mutual funds Investments is 19000 crores

న్యూఢిల్లీ : స్టాక్‌మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఫిబ్రవరి నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. గత నెలలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.19,705 కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ కేటగిరీలో వరుసగా 12వ నెల కూడా నిధుల ప్రవాహం కొనసాగింది. ఎఎంఎఫ్‌ఐ (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) డేటా ప్రకారం, 11 ఈక్విటీ ఫండ్స్ కేటగిరీలు రికార్డు స్థాయిలో పెట్టుబడులను అందుకున్నాయి. ఈక్విటీ కేటగిరిలో ఫ్లెక్సిక్యాప్, సెక్టోరియల్ ఫండ్స్ వరుసగా రూ.3,873 కోట్లు, రూ.3,441 కోట్ల చొప్పున నిధులను అందుకున్నాయి. సిప్ (సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా నిధుల ప్రవాహం రూ.11,437 కోట్లతో ఇప్పటికీ బలంగా ఉండగా, జనవరితో పోలిస్తే ఇది రూ.79 కోట్లు తక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News