Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో మాచారెడ్డి ఎంపిపి లోయపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ బిల్డర్, పారిశ్రామిక వేత్త ముత్యాల నర్సింహారెడ్డి గురువారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఆయనతోపాటు నగరానికి చెందిన పలువురు బిల్డర్లు రంగారవి, ప్రసాద్,అనిల్ కట్టురి, వెంకటరత్నం, ప్రసాద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అనొక్ రెడ్డి, పొన్నాల రమేష్ రెడ్డి, తకురి జగదీశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ప్రాణుతాన్ రెడ్డి, సత్యనారాయణ, సంగమేశ్వర్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో లోయపల్లి చిన్న నర్సింగరావు గారు లక్ష్మీరావులపల్లి ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బెంజరం నవీన్ రెడ్డి, బిఆర్‌ఎస్ నిజాంపేట్ అధ్యక్షుడు రంగారాయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News