Sunday, December 22, 2024

యుకెలో కౌన్సిలర్‌గా ఎన్నికైన మువ్వల చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : లండన్ నగరం ’స్లో‘ బరో లోని ‘లాంగే మేరిష్‘ నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన మువ్వల చంద్రశేఖర్ అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలుపొందారు. గురువారం జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి షనక్ నేతృత్వం వహిస్తున్న పార్టీ నుంచి విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. నా విజయానికి సహకరించిన యుకెలోని తెలుగు వారందరికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. థేమ్స్ నదీ తీరాన ఒక తెలుగు బిడ్డగా గెలుపొందడం గర్వంగా ఉందన్నారు. ఈ విజయం పట్ల తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యుకె ప్రతినిధి మట్టా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News