Monday, January 20, 2025

చనిపోయిన తండ్రి తిరిగొచ్చేసరికి… అంతా షాక్

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: కొన్ని వారాల క్రితం అదృశ్యమైన వ్యక్తి మృతదేహం సొంత గ్రామ శివారులో కనిపించడంతో కుటుంబ సభ్యులు దహనం చేశారు. అనంతరం ఆ వ్యక్తి తిరిగి రావడంతో గ్రామస్థులు షాక్ గురయ్యారు. ఆ కుటుంబంలో ఆనంధానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ ప్రాంతంలోని అరుయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొన్ని వారాల క్రితం బభంగామా గ్రామానికి చెందిన తేజూ సహాని అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు.

Also Read: మరో ఐదేళ్లు కష్టపడితే అన్నింటా మనమే టాప్

గ్రామ సమీపంలో మృతదేహం కనిపించడంతో తన తండ్రిదే అని అతడి కుమారుడు ప్రమోద్ సహాని తెలిపాడు. గ్రామస్థులు కూడా తేజూ సహానిదిగా గుర్తించడంతో పోలీసులు శవ పరీక్ష నిర్వహించిన అనంతరం అతడి కుమారుడికి మృతదేహాన్ని అప్పగించారు. తన తండ్రి మృతదేహానికి అంతిమయాత్రి నిర్వహించి దహనసంస్కారాలు జరిపించారు. తన తండ్రి కనిపించకుండాపోయినప్పటి నుంచి దిగులుతో తన తల్లి చనిపోయిందని ప్రమోద్ సహాని తెలిపాడు. దహన సంస్కారాలు జరిపిన రెండు రోజుల తరువాత తన తండ్రి ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో కనిపించడంతో ఇంటికి తీసుకొచ్చాడు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. మృతదేహం ఎవరిది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి మనోజ్ పాండే తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News