Wednesday, April 2, 2025

సెల్ఫీ దిగుదామని చెప్పి… భర్తను చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది….

- Advertisement -
- Advertisement -

పాట్నా: సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను భార్య చెట్టుకు కట్టేసి అతడిపై కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన బిహార్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షహిబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఓ గ్రామంలో భర్తను భార్య సెల్ఫీ దిగుదాము అని అడిగింది. భర్తను చెట్టుకు దగ్గరుకు తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అతడిపై భార్య కిరోసిన్ పోసి తగలబెట్టింది. భర్త కేకలు వేయడంతో గ్రామస్థులు మంటలను ఆర్పేసి అతడిని షహిబ్‌గంజ్‌లోని హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉండడంతో అతడి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆమెకు గ్రామంలో మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉండడంతోనే ఈ ఘాతూకానికి పాల్పడిందని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: విండీస్ సిరీస్… షెడ్యూల్ ఖరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News