Monday, December 23, 2024

పెద్దపల్లి కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లా కలెక్టర్‌గా 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ముజమ్మిల్ ఖాన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సిద్దిపేట జిల్లా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ముజమ్మిల్ ఖాన్ రిటైర్డ్ డీజీ ఏకే ఖాన్ కుమారుడు, కాగా 2017 యూపీఎస్సీ సివిల్స్‌లో 22వ ర్యాంకు సాధించాడు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సంగీత సత్యనారాయణ టీఎస్ పుడ్స్ ఎండీగా బదిలీ అయ్యారు.

అలాగే లోకల్ బాడీ అదనపు కలెక్టర్‌గా పని చేసిన కుమార్ దీపక్ నాగర్ కర్నూల్ జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్‌గా కరీంనగర్ జడ్పీ సీఈఓగా పని చేసిన సీహెచ్ ప్రియాంక రానున్నారు.

కాగా జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణను బదలీ చేస్తూ కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న శ్యాం ప్రసాద్ లాల్‌ను పెద్దపల్లి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. గతంలో పని చేసిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, లోకల్ బాడీ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ పనితీరుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నూతనంగా జిల్లాకు వస్తున్న కలెక్టర్లకు స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News