Monday, December 23, 2024

వినూత్నంగా ముజిగల్ అకాడమీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగీత విద్య పట్ల అచంచలమైన అంకితభావానికి ప్రసిద్ధి చెందిన విశిష్ట సంస్థ ముజిగల్, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్నంగా తమ కొంపల్లి, కూకట్‌పల్లి, మాదాపూర్, మణికొండ, కొత్తపేట్ సహా దేశవ్యాప్తంగా తమ శాఖలలో వేడుకలు నిర్వహించింది. స్వేచ్ఛ, ఐక్యత యొక్క స్ఫూర్తితో అకాడమీ ప్రాంగణం ప్రతిధ్వనించింది.

ఈ కార్యక్రమాలు దేశం యొక్క మహోన్నత చరిత్రకు, స్వేచ్ఛను పొందేందుకు యోధులు చేసిన త్యాగాలకు నివాళిగా నిలిచాయి. ముజిగల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన కళాత్మక ప్రదర్శనలు దేశభక్తి ని అణువణువూ రేకెత్తించాయి. అకాడమీ అధ్యాపకులు ఈ వేడుకలలో కీలక పాత్ర పోషించారు. వారు స్వంతంగా స్వరపరిచిన పాటలను ప్రదర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, సమకాలీన ప్రపంచంలో దాని శాశ్వతమైన ఔచిత్యంపై తమ పరిజ్ఙానం పంచుకున్నారు.

ఈ విశేషమైన కార్యక్రమం రూపొందించడం తమకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందని ముజిగల్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ముజిగల్ అకాడమీ తమ విద్యార్థులలో జాతీయత ను పెంపొందిస్తూ కళాత్మక నైపుణ్యాన్ని పెంపొందించడంలో తమ దృఢమైన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News