Tuesday, January 21, 2025

మహారాష్ట్రలో 35 స్థానాలు గెలుస్తాం : సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో విపక్షకూటమి మహావికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను సాధించుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారామతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. మాజీ సిఎం , శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ థాక్రే భారామతి లోక్‌సభ పరిధిలో కడక్ వాస్తా నుంచి త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలంతా సుప్రియా సులే వైపు ఉన్నారని స్పష్టం చేశారు. భారామతి ఎంపీ అభ్యర్థిగా శరద్ పవార్ కుమార్తె సులే బరిలో దిగారు.

ఆమె ప్రత్యర్థిగా డిప్యూటీ సీఎం అజిత్ పవర్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందో అన్న అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే బారామతి స్థానం నుంచి సుప్రియా మూడుసార్లు ఎన్నికయ్యారు. .నాలుగోసారి ఆమె బరిలో ఉన్నారు. మహారాష్ట్ర లోని మహావికాస్ అఘాడీ కూటమిలో ఎన్సీపీ (శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీ , శివసేన (యుబీటి) పార్టీలు ఉన్నాయి. శరద్ పవార్ సోదరుడే అజిత్ పవార్. ఈ ఎన్నికల్లో తన భార్య సునేత్ర పవార్ భారీ ఆధిక్యతతో విజయం సాధిస్తారని డిప్యూటీ సిఎం అజిత్ పవార్ కూడా విశ్వసిస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News