Tuesday, December 24, 2024

నా వయసు జాతీయ సమస్యగా మారింది: త్రిష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్రిష వయసు 40 దాటడంతో ఆమెపై నెటిజన్లు కామెంట్ చేయడంతో రీకౌంటర్ ఇచ్చారు. భారతీయ సినీ పరిశ్రమలో 40 దాటిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. తాను తొలి ఆమెను కాదని బదులిచారు. తన వయసు ఇప్పుడు జాతీయ సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు. తనకు 40 ఏళ్లు పడడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చురకలంటించారు. బుద్ధిలేని వాళ్లు న్యూసెన్స్ చేస్తున్నారని, తన వయసు గురించి పిచ్చి రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయని, సిగ్గు అనిపించడం లేదా? అని ఘాటుగా స్పందించారు.

మొదట్లో తాను పట్టించుకోలేదని మితిమీరిపోవడంతో అందుకే స్పందించాల్సిన అవసరం ఏర్పండిదన్నారు. సోషల్ మీడియాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు అవకాశాలు రావడంతో కొందరికి నచ్చడం లేదని దుయ్యబట్టారు. అందుకే పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారని త్రిష ధ్వజమెత్తారు. తాను తుదిశ్వాస విడిచే వరకు నటిస్తూనే ఉంటానని, నటనకు వయసుతో పని లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News