Monday, December 23, 2024

నాది ఛాలెంజింగ్ రోల్

- Advertisement -
- Advertisement -

My challenging role

 

విశ్వక్ సేన్ హీరోగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను మే 6 విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ “మంచి సందేశాన్నిచ్చే చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. అందుకే నేను ఈ సినిమాలో నటించాను. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రలో నటిస్తే నేను మాధవి పాత్ర పోషించాను. తక్కువగా మాట్లాడే మాధవి పాత్రలో విభిన్నమైన భావోద్వేగాలను పలికించాలి. ఇది ఛాలెంజింగ్ రోల్. హీరో విశ్వక్‌సేన్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇక దర్శకుడు సుకుమార్ సినిమాలో నటించాలనేది నా కోరిక. అతని దర్శకత్వంలో మంచి లవ్ స్టోరీ మూవీ చేయాలనుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News