Wednesday, January 22, 2025

నా కుమార్తె ఏ తప్పూ చేయలేదు: పూజా ఖేడ్కర్ తండ్రి

- Advertisement -
- Advertisement -

తన కుమార్తె ఎటువంటి తప్పు చేయకుండానే ఆమెను వేధిస్తున్నారని వివాదాస్పద ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ తెలిపారు. తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. పుణెలో అసిస్టెంట్ లెక్టర్‌గా చేరడానికి ముందే తనకు విడిగా ఒక కార్యాలయం, ఒక కారు, ఒక ఇల్లు కావాలని పూజా ఖేడ్కర్ డిమాండు చేయడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై దిలీప్ ఖేడ్కర్ స్పందిస్తూ తన కుమార్తె ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. కూర్చోవడానికి తనకంటూ ఒక కార్యాలయం కావాలని కోరడం లప్పా అని ఆయన ప్రశ్నించారు. ఎవరో దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రస్తుతం తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ చేస్తున్నందున దీనిపై మాట్లాడడం బాగుండదని ఆయన చెప్పారు.

పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులపై కేసు
వివాదాస్పద ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. పూజా ఖేడ్కర్ తల్లి మనోరమా ఖేడ్కర్ కొందరు రైతులకు పిస్టల్ చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఒక వీడియో వైరల్ కావడంతో ఒక రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుణె పోలీసులు మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్ ఖేడ్కర్‌పై కేసు నమోదు చేశారు. పుణె జిల్లాలోని ముల్షీ తహసిల్‌లో ఒక భూ వివాదానికి సంబంధించి పూజా మమతా ఖేడ్కర్ రైతులను పిస్టల్ చూపుతూ బెదిరించినట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేసింది. ముల్షీ తహసిల్‌లో దిలీప్ ఖేడ్కర్ 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తమ భూమికి ఆనుకుని ఉన్న వేరే రైతుల భూమిని ఖేడ్కర్ ఆక్రమించుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా బౌన్సర్లను వెంటపెట్టుకుని వచ్చిన మమతా ఖేడ్కర్ పిస్టల్ చూపిస్తూ ఒక రైతును బెదిరించినట్లు వీడియోలో దర్శనమిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News