Wednesday, January 22, 2025

నా అల్లుడు ప్రధాని… అది నా కుమార్తె ఘనతే: సుధామూర్తి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధాన మంత్రిగా మార్చిన ఘనత తన కుమార్తె అక్షతా మూర్తిదేనని రిషి సునాక్ అత్తగారు సుధా మూర్తి వెల్లడించారు. తాను తన భర్త నారాయణ మూర్తిని ఒక వ్యాపారవేత్తను చేయగలిగానని, అంతకు మించి తాను ఏమీ చేయలేకపోయానని, కాని తన కుమార్తె అక్షతా మూర్తి మాత్రం ఆమె భర్త రిషి సునాక్‌ను ప్రధాన మంత్రిని చేయగలిగిందని ఆమె అన్నారు.

Also Read:  హిందూ కోడ్ బిల్లులో ఏముంది?

ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సుధా మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కారణంగానే రిషి సునాక్ బ్రిటన్‌కు అత్యంత పిన్న వయసులో ప్రధాని కాగలిగాడని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉండడమే ఇందుకు కారణం..ఒక భర్తను భార్య ఎలా మారుస్తుందో మీరే చూడండి.అయితే నా భర్తను నేను మార్చలేకపోయాను.

ఆయనను ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాను. కాని నా కుమార్తె మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధాన మంత్రిని చేసింది..అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇన్ఫోసిస్ టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి అన్నారు.
రిషి సునాక్ 2009లో అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. అతి పిన్న వయసులోనే బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఆయన ఎదిగారు.
ప్రపంచంలోని సంపన్నులలో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వ్యక్తిగత ఆస్తులు దాదాపు 730 మిలియన్ డాలర్లు ఉంటాయి. అక్షతా మూర్తి కూడా తన తల్లిదండ్రుల లాగే నిరాడంబర జీవితాన్ని కోరుకుంటారు. రిషి సునాక్ ఎంపిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఏడేళ్లకే బ్రిటన్ ప్రధాని పదవిని అధిష్టించి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఖ్యాతి గడించారు.
తన కుమార్తె అక్షత కారణంగా రిషి సేనార్ ఆహార నియమాలు ఎలా మారాయో కూడా ఈ వీడియోలో సుధా మూర్తి వివరించారు. రాఘవేంద్ర స్వామి భక్తులమైన తాము ప్రతి గురువారం ఉపవాసం ఉంటామని ఆమె తెలిపారు. గురువారం నాడే ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ప్రారంభమైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తన అల్లుడు రిషి సునాక్ పూర్వీకులు 150 ఏళ్లుగా ఇంగ్లండ్‌లోనే ఉంటున్నారని, అయినప్పటికీ వారంతా చాలా దైవభక్తులని ఆమె తెలిపారు. తన వియ్యపురాలు(రిషి సునాక్ తల్లి) ప్రతి సోమవారం ఉపవాసం ఉంటారని, కాని రిషి సునాక్ మాత్రం ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారని ఆమె వెల్లడించారు.

https://www.instagram.com/rayara_mahime/?utm_source=ig_embed&ig_rid=dbc8d3be-9269-4096-9cec-14e3fdbe6a47

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News