Wednesday, April 2, 2025

మా నాన్న అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి: రవిబాబు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: శనివారం రాత్రి గుండె పోటుతో సీనియర్ నటుడు చలపతి రావు (79) కన్నుమూశారని ఆయన కుమారుడు రవి బాబు తెలిపారు. ఆయన కుమార్తె అమెరికా నుంచి వచ్చాకా అంత్యక్రియలు జరుగుతాయన్నారు. బుధవారం రోజున మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని రవి బాబు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కయాన్ని తన కుమారుడు రవి బాబు ఇంట్లోనే అభిమానుల సందర్శన కోసం ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పార్ధీవ దేహాన్ని ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అయన ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్ తన కుమారుడు రవి బాబు ఇంట్లో వుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News