Thursday, December 12, 2024

మా నాన్నను విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు: మనోజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాన్న అంటే తనకు ప్రాణమని, మా నాన్న దేవుడు అని నటుడు మంచు మనోజ్ తెలిపారు. మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని ఆరోపణలు చేశారు. బుధవారం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. మా నాన్న దృష్టిలో తనని శత్రువుగా చిత్రీకరించారని మనోజ్ దుయ్యబట్టారు. తాను, నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామని, వాటికి కూడా అడ్డంకులు సృష్టించారన్నారు. తనపై దాడులు చేశారని, మా నాన్న ముందే తనని కొట్టారని,  తనకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారని చేశారన్నారు.

మూడు రోజులు బయటకు వెళ్ళు, మనోజ్ సర్ధిచెప్తామన్నారని, మా అమ్మను కూడా నమ్మించారని మనోజ్ తెలియజేశారు. మీడియా మిత్రులకు మా నాన్న, అన్న తరపున క్షమాపణలు చెబుతున్నానని, ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడు తోడుగా ఉంటానని తెలియజేశారు. తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు. మనోజ్ మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురై కన్నీంటి పర్యంతమయ్యారు. ఆస్తి కోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News